కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం - ttd singer sobharaju song on corona
కరోనా వైరస్ ప్రభావం బారిన పడకుండా తితిదే ఆస్థాన విద్వాంసురాలు, గాయని శోభారాజు ప్రజలను చైతన్యపరిస్తూ ఓ గీతాన్ని ఆలపించి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రజలు ఇళ్లు వదలి రావొద్దని, ఎవరినీ కలవొద్దంటూ, మన సంస్కృతిలో భాగమైన నమస్కారాన్ని పాటించాలని ఆమె సూచించారు.
![కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6902148-158-6902148-1587587816510.jpg)
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరుస్తూ తితిదే ఆస్థాన విద్వాంసురాలు, గాయని శోభారాజు గీతాన్ని ఆలపించి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. వైరస్ నియంత్రణకు ప్రజలు ఇళ్లువదలి రావొద్దని, ఎవరిని కలవరాదంటూ... చేతులు సబ్బుతో కడుక్కోవాలంటూ పాట పాడారు. ముఖంలోని ఏ భాగాన్ని చేతితో తాకరాదంటూ... ఇతరులతో చేయి చేయి కలపకుండా మన సంస్కృతిలో భాగమైన నమస్కారాన్ని చేయాలని సూచించారు. మంచి భవిష్యత్తు కోసం కరోనా బారిన పడకుండా ఉండడమే నిజమైన ఉపనిషత్తుగా శోభారాజు ఆలపించిన పాట ప్రజలను చైతన్యపరుస్తూ ఆకట్టుకుంటోంది.