తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు... ఆలయ ఈవో గీతా రెడ్డికి పట్టు వస్త్రాలు అందించారు. ఆ వస్త్రాలకు అష్టోత్తర మండపం వద్ద శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు.