దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్న తితిదే మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇకపై టికెట్లు ఉండి నడక మార్గంలో వచ్చే వారిని ముందురోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి, వాహనాల్లో వచ్చే వారిని ముందు రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. పరిమిత సంఖ్యలో టికెట్లను జారీ చేస్తున్న తితిదే.. తిరుమల కొండపై అధిక సంఖ్యలో భక్తులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ ఆంక్షలు తప్పనిసరి - కరోనా నేపథ్యంలో తిరుమలలో నిబంధనలు న్యూస్
కరోనా కేసులు పెరుగుతుండడంతో తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే ఆంక్షలు విధించింది. కొండపై అధిక సంఖ్యలో భక్తులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
![తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ ఆంక్షలు తప్పనిసరి ttd restrictions on devotees about corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11204615-279-11204615-1617026430023.jpg)
ttd restrictions on devotees about corona