గుంటూరుకు చెందిన ఓ పాఠకుడికి సప్తగిరి ఆధ్యాత్మిక పత్రికతో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం సరఫరా అయినట్లు వచ్చిన వార్తలపై తితిదే స్పందించింది. తితిదే ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కొంత మంది చేసిన దుశ్చర్య అని మండిపడింది. ఈ విషయంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.
బాధ్యత తపాలా శాఖదే...
సప్తగిరి మాస పత్రిక ప్యాకింగ్, సరఫరా భాధ్యత మొత్తం తపాలా శాఖదేనని తితిదే స్పష్టం చేసింది. ఇందుకోసం పోస్టేజీ ఛార్జీలతో పాటు ఒక్కో ప్రతికి అదనంగా 1.05 రూపాయలను తితిదే చెల్లిస్తున్నట్లు వివరించింది. సప్తగిరి మాస పత్రికను బుక్ పోస్టులో పంపుతున్నందున కవరుకు ఎలాంటి సీలు ఉండదని స్పష్టం చేసింది.