శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది. ఆగస్టు నెలకు సంబంధించిన ఈ టికెట్లను రోజుకు 5 వేల చొప్పున విడుదల చేశారు.
ఈ మేరకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి తగ్గని కారణంగా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. టికెట్లు కోసం ఎక్కువ మంది భక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య..
టికెట్ల కోసం అధిక సంఖ్యలో నమోదుకు భక్తులు ప్రయత్నించడంతో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వర్లు పనిచేయలేదు. ఈ కారణంగా.. వెబ్‌సైట్‌లో దర్శనం టికెట్లు కనిపించలేదు. సర్వర్లను పునరుద్ధరించేందుకు తితిదే అధికారులు ప్రయత్నిస్తున్నారు.