శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2020 మే నెలకు సంబంధించి 72,773 టికెట్లు విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 11,498 సేవా టికెట్లు, సుప్రభాతం 8143, తోమాల 120, అర్చన 120 టికెట్లు, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2875, కరెంటు బుకింగ్ కింద 61,275 ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉంచింది. విశేషపూజ 2000, కల్యాణోత్సవం 14,725 సేవా టికెట్లు, ఊంజల్‌సేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700 టికెట్లు, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకరణ 16,800 టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల - శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు న్యూస్
తిరుమల తరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే నెలకు సంబంధించి 72 వేలకు పైగా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు.

ttd release online arjitha seva tickets
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే
ఇవీ చదవండి : ఆటో ఎక్స్పో 2020: కళ్లు చెదిరే.. బళ్లు అదిరే