తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను శనివారం ఉదయం 9 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా రోజుకు 25 వేల టికెట్ల చొప్పున నెల రోజుల కోటా విడుదల చేయనున్నారు. అదే రోజున సాయంత్రం తిరుమలతో పాటు.. తిరుపతిలో గల తితిదే వసతి గదులను వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఈనెల 20న శ్రీవారి దర్శన టిక్కెట్ల విడుదల.. - తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్
ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ నెల 20న శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. రోజుకు 25 వేల టికెట్ల చొప్పున నెల రోజుల కోటా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 20న శ్రీవారి దర్శన టిక్కెట్ల విడుదల