ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మే 28న తితిదే ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు - తిరుపతిలో తితిదే ఉచిత సామూహిక వివాహాలు

మే 28న తితిదే ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు జరగనున్నాయి. 13 జిల్లాల్లోని ఆశావహులు.. మే 25లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ttd free mass weddings at tirupati
తిరుపతిలో సామూహిక వివాహాలు, మే 28న ఉచిత సామూహిక వివాహాలు

By

Published : Mar 26, 2021, 5:22 PM IST

కళ్యాణమస్తు ద్వారా ఉచిత వివాహాలకు తితిదే దరఖాస్తులు ఆహ్వానించింది. మే 28న రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఉచిత సామూహిక వివాహాలు జరిపించనుంది. దంపతులకు మంగళసూత్రంతో పాటు వస్త్రాలు, బోజనాలు ఉచితంగా అందించనున్నారు.

www.tirumala.org లో, ఆయా జిలాల్లోని హిందూధర్మ ప్రచార పరిషత్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. మే 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మే 28న నిర్ణయించిన సమయంలో వివాహాలు జరగనున్నట్లు తితిదే వెల్లడించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details