ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులకు ప్రోటీన్ పౌడర్‌ను అందించిన తితిదే - ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులకు ప్రోటీన్ పౌడర్‌ను అందించిన తితిదే
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడడంతో తితిదే అధికారులు ప్రొటీన్ పౌడర్‌ను అందించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని స్వీమ్స్ జనరిక్ మెడికల్ షాపు యాజమాన్యం రూ. 45 వేల విలువ చేసే జనఔషధి ప్రోటీన్ పౌడర్‌ను విరాళంగా ఇచ్చారు.
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులకు ప్రోటీన్ పౌడర్‌ను తితిదే అధికారులు అందించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని స్వీమ్స్ జనరిక్ మెడికల్ షాపు యాజమాన్యం రూ. 45 వేల విలువైన జనఔషధి ప్రోటీన్ పౌడర్‌ను ఇచ్చారు. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు స్వీమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు.. ధర్మగిరి వేద పాఠశాలలోని అధ్యాపకులు, విద్యార్థులకు అందించారు. దీనిని పాలలో కలిపి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని దాతలు తెలిపారు.