ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే కీలక నిర్ణయం...పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ దర్శనం

తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త తెలిపింది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తితిదే వెల్లడించింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

By

Published : Dec 11, 2020, 8:47 PM IST

Tirumala
Tirumala

శ్రీవారి దర్శనం విషయంలో నిబంధనలను తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించింది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారినీ ఇకనుంచి దర్శనానికి అనుమతిస్తామని తితిదే ప్రకటించింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో ఎవరైనా దర్శనం చేసుకోవచ్చని సూచించింది. వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ల సౌకర్యం లేదని స్పష్టం చేసింది.

కరోనా పరిస్థితుల అనంతరం శ్రీవారి ఆలయం తిరిగి తెరుచుకున్నాక పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లకు పైబడిన వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు తితిదే. తాజా నిర్ణయంతో వారికీ శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది.

ABOUT THE AUTHOR

...view details