ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లి చేసుకోబోయే జంటకు..ఈ సంగతి తెలుసా..! - శ్రీవారి ఆశీర్వచన పత్రిక

కల్యాణం అయిన వెంటనే.. నూతన వధూవరులు తిరుమల శ్రీవారి ఆశీర్వాదం కోసం తిరుపతి వెళ్తుంటారు. ఆ వేంకటేశ్వరుని దర్శించుకుంటే కలకాలం కలిసి మెలిసి ఉంటారని హైందవుల నమ్మకం. సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న తితిదే... నూతన జంటలకు శ్రీవారి ఆశీర్వచన పత్రికలను నేరుగా వారి ఇంటికే పంపుతుంది.

ttd

By

Published : Nov 8, 2019, 9:38 PM IST

పెళ్లిచేసుకోబోయే జంటకు..ఈ సంగతి తెలుసా..!

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగులు వేసే వధూవరులకు కోనేటి రాయుని ఆశీస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది. నూతన జంటకు స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తుంది. ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన వస్తుండడంతో మరింత చేరువచేసేందుకు కృషిచేస్తోంది. ఇంటికే శ్రీవారి ఆశీర్వచన పత్రికలను పంపుతున్నారు.

హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. యువతీ యువకులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి జగద్రక్షకుడైన శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. వివాహ శుభలేఖను పూర్తి చిరునామాతో తితిదేకు పంపితే చాలు... శ్రీవారి అక్షింతలు, కుంకుమ, కంకణం, కల్యాణసంస్కృతి అనే ఆశీర్వచన పత్రికను తపాలా ద్వారా ఇంటికే పంపుతున్నారు. గృహస్థ జీవితం కోరుకొనే స్త్రీ, పురుషులకు అన్యోన్యం, అనురాగబంధంతో ముడివేసే వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు ”కల్యాణ సంస్కృతి” పేరిట ఓ పుస్తకాన్ని... వేద ఆశీర్వచన పత్రికను నవవధూవరులకు పంపుతున్నారు.

మీ శుభలేఖ పంపవలసిన చిరునామా...తితిదే పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి – 517501.

ABOUT THE AUTHOR

...view details