తితిదే పాఠశాలల్లో కొవిడ్-19 మార్గదర్శకాలు, మధ్యాహ్న భోజనం అమలుతీరును జేఈవో(ఆరోగ్యం మరియు విద్య) సదా భార్గవి పరిశీలించారు. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్, శ్రీ కోదండరామ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, శ్రీ పద్మావతి గర్ల్స్ హైస్కూళ్లను జేఈవో తనిఖీ చేశారు. పాఠ్యాంశాల బోధన, రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్-19 మార్గదర్శకాల అమలును పరిశీలించి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. జేఈవో వెంట తితిదే విద్యాశాఖాధికారి ఆర్.రమణప్రసాద్ ఉన్నారు
తితిదే పాఠశాలలను సందర్శించిన జేఈవో - తితిదే పాఠశాలల న్యూస్
తితిదే పాఠశాలల్లో కొవిడ్-19 మార్గదర్శకాలు, మధ్యాహ్న భోజనం అమలుతీరును జేఈవో సదా భార్గవి పరిశీలించారు. . పాఠ్యాంశాల బోధన కరోనా మార్గదర్శకాల అమలును పరిశీలించి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
తితిదే పాఠశాలలను సందర్శించిన జేఈవో