ఆస్తుల విక్రయ నిర్ణయంపై తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పందించారు. విక్రయించాలని నిర్ణయం తీసుకొన్న 50 ఆస్తులు నిరర్థకమైనవేనని... వీటి ద్వారా తితిదేకు ఎలాంటి ఆదాయం సమకూరదని, ఆక్రమణకు గురవుతున్నాయని వివరించారు. భక్తుల్లో గందరగోళం సృష్టించడానికి కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ చట్టం నిబంధనల మేరకే తితిదే ఆస్తులను విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆస్తుల విక్రయ నిర్ణయంపై స్పందించిన తితిదే ఛైర్మన్ - y.v subbareddy latest news
విక్రయించాలనుకున్న తితిదే 50 ఆస్తులు నిరర్థకమైనవేనని, వీటి ద్వారా తితిదేకు ఎలాంటి ఆదాయం సమాకూరకపోగా ఆక్రమణకు గురవుతున్నాయని తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి వివరించారు. దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మక ప్రక్రియ 1974 సంవత్సరం నుంచి జరుగుతోందని.., 2014 సంవత్సరం వరకు తితిదేకు సంబంధించిన 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారని ఆయన గుర్తుచేశారు.
ఆస్తులు విక్రయించాలని ధర్మకర్తల మండలి తీసుకొన్న నిర్ణయంతో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న తితిదే ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదన్నారు.
దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మక ప్రక్రియ 1974 సంవత్సరం నుంచి జరుగుతోందని.... 2014 సంవత్సరం వరకు తితిదేకు సంబంధించిన 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారని వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 50 నిరర్థక ఆస్తుల విలువను 23.92 కోట్ల రూపాయలుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం చేసి బహిరంగ వేలం వేస్తున్నట్లు తెలిపారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని వై.వి.సుబ్బారెడ్డి హితవు పలికారు.