ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: తిరుమలలో కాషన్‌ డిపాజిట్‌ అమలు

తిరుమలలో గదుల కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని తితిదే అమలు చేస్తోంది. 2017వ సంవత్సరంలో భక్తుల సౌకర్యార్థం రద్దు చేయగా.. నేడు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

deposit policy
కాషన్‌ డిపాజిట్‌

By

Published : Aug 5, 2021, 2:17 PM IST

తిరుమలలో గదుల కేటాయింపులో కాషన్​ డిపాజిట్​ విధానాన్ని తితిదే మళ్లీ ప్రారంభించింది. అద్దె గదులు పొందే వారి నుంచి 500 రూపాయలకన్నా తక్కువ ఉన్న గదులకు 500 రూపాయలు.. అంతకన్నా ఎక్కువ ఉన్న గదులకు అద్దెకు సమానంగా డిపాజిట్‌ ను వసూలు చేస్తున్నారు. 2017వ సంవత్సరంలో భక్తుల సౌకర్యార్థం ఈ విధానంను రద్దు చేశారు. నేటి నుంచి మరలా తిరిగి ప్రారంభించారు. గదులు కేటాయించే సమయంలోనే అద్దెతో పాటు కాషన్‌ డిపాజిట్‌ను వసూలు చేస్తున్నారు. డిజిటల్‌ పేమెంట్​ను మాత్రమే అమలు చేస్తున్న తితిదే.. గది ఖాళీ చేసిన తరువాత వారి బ్యాక్‌ ఖాతాకు డిపాజిట్‌ మొత్తం తిరిగి చేరేలా సాంకేతికతను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details