కరోనా వైరస్‌పై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందిస్తుందని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించిందని ఆయన తెలిపారు. దీనిలో మౌలిక వసతుల కల్పనకు 19 కోట్ల రూపాయలను తితిదే తరఫున ఇస్తున్నట్లు ఈవో ప్రకటించారు. ఇప్పటికే రూ.8కోట్లను కలెక్టర్‌కు విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే మిగతా సొమ్మును అందజేస్తామని అన్నారు. అలాగే రోజూ 50 వేల మందికి భోజన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తితిదే ఎలాంటి సాయం అందించటం లేదంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
'కరోనాపై పోరులో తితిదే సహకారం ఉంటుంది'
కరోనా వ్యాప్తి నివారణకు తితిదే సాయం అందిస్తుందని దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు స్విమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు 19 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ttd eo anil singhal