తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తితిదే అటవీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతిలోని ఉప అటవీ సంరక్షణాధికారి కార్యాలయం ముందు తితిదే ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోవిందా.. గోవిందా అంటూ స్వామి వారికి మొరపెట్టుకున్నారు.
250 రోజులుకు పైగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నా.. తితిదే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం లేదంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. టైం స్కేలు అమలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసినా.. డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తితిదే పాలకమండలి వెంటనే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.