ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్మికులను విధుల్లోకి అనుమతించిన తితిదే - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అనుమతించిన తితిదే

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్‌ ఏజెన్సీ పద్మావతి ఎఫ్‌ఎంఎస్ గడువును పొడిగించింది. 1300మంది సిబ్బందిని విధుల్లోకి అనుమతించింది.

ttd extended padmavati fms contract
ttd extended padmavati fms contract

By

Published : May 2, 2020, 9:08 PM IST

కాంట్రాక్ట్‌ ఏజెన్సీ పద్మావతి ఫెసిలిటీ మేనేజ్​మెంట్ సర్వీసెస్​ గడువును పొడిగిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ కాలాన్ని ఈనెల చివరి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పద్మావతి ఏజెన్సీ ద్వారా సేవలు అందిస్తున్న 1300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని విధుల్లోకి అనుమతించింది.

తితిదేకు సంబంధించిన వసతి భవనాలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనుల కోసం నియమించుకున్న పద్మావతి ఫెసిలిటీ మేనేజ్​మెంట్ సర్వీసెస్ గుత్తేదారు... సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలతో దానిని తొలగిస్తూ గతంలో తితిదే పాలక మండలిలో తీర్మానం చేసింది. టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీని నియమించాలని ఆదేశించటంతో పాటు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీకి ఏప్రిల్ 30వరకూ గడువును ఇచ్చింది. ఇటీవల గడువు ముగియటంతో ఒప్పంద కార్మికులను తితిదే విధుల్లోకి అనుమతించలేదు. తాజా నిర్ణయంతో 1300 మంది కార్మికులకు ఊరట లభించింది.

ABOUT THE AUTHOR

...view details