రాజులు, బ్రిటీషు వారు గౌరవించిన డిక్లరేషన్ నిబంధన అవసరం లేదనే అధికారం వైవీ సుబ్బారెడ్డికి ఎవరిచ్చారని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. ఛైర్మన్ ఇష్టానుసారం మాట్లాడుతుంటే, మిగిలిన బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. గతంలో తిరుమల విషయంలో అయినదానికీ, కానిదానికీ గగ్గోలు పెట్టిన స్వామీజీలు, పీఠాధిపతులు... జగన్ చర్యలపై, సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. డిక్లరేషన్లో సంతకం ఎందుకని ప్రశ్నించేవారు, అసలు స్వామివారిని దర్శించుకోకపోతే మాత్రం ఏమైందని సూటిగా ప్రశ్నించారు.
'తిరుమల కొండపైనే మద్యం అమ్మేలా ఉన్నారు!' - ttd ex chairman Putta Sudhakar Yadav on declearation news
ప్రభుత్వ వైఖరి చూస్తుంటే, భవిష్యత్లో తిరుమల కొండపైనే మద్యం అమ్మకాలు జరిపి, మద్యం సేవించిన భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తారేమోనన్న అనుమానం కలుగుతోందని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు.
తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్