తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులైన జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకునేందుకు ఆయన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి బయల్దేరే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకున్న ఆయన.. శ్రీవారి ఆలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు. రంగనాయక మండపంలో ఈవో జవహర్‌రెడ్డికి వేదపండితుల ఆశీర్వచనం చేశారు. అన్నమయ్యభవన్‌లో తితిదే ఉన్నతాధికారులతో జవహర్‌రెడ్డి సమావేశం అవుతారు. ఈ నెల 16 నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
తితిదే ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి
తితిదే ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. రంగనాయక మండపంలో ఈవో జవహర్‌రెడ్డికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
ttd_eo