తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని తితిదే ఈవో, రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూం ఛైర్మన్ జవహర్‌రెడ్డి సూచించారు. కోవిడ్ ఆసుపత్రిలో కంట్రోల్ రూం ల ఏర్పాటు ద్వారా కోవిడ్ బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కోవిడ్ బారిన పడిన బాధితుల పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారిని జిల్లా యంత్రాంగం తరపున నియమించాలన్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం, తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం వసతి సమూదాయాలను గత సంవత్సరం లాగానే కోవిడ్ బాధితులకు వినియోగించుకోవాలని కలెక్టర్‌కు తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో 450 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఐదవ అంతస్తులో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేసి కొవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలోని పడకలను కొవిడ్ బాధితులకు వినియోగించాలని, జిల్లా యంత్రాంగం ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని సమకుర్చాలని ఈవో తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రికి అవసరమైన వీల్చైర్లు, స్ట్రెచర్లు, తదితరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులలో రోగులకు తితిదే నిధులతో భోజనం అందించాలని కలెక్టర్ కోరగా.. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని తితిదే అధికారులను ఈవో ఆదేశించారు.