రెండు తెలుగు రాష్ట్రాలలో తితిదే నిర్వహిస్తున్న ఆరు వేద పాఠశాలలను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురానున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వేద విద్య అభ్యసించేందుకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపిక విధానం, ప్రవేశాలు, పాఠ్యాంశాలు, కోర్సుల రూపకల్పన, సర్టిఫికెట్ల ప్రదానంపై.. విధి విధానాలు రూపకల్పనకు త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులకు వివరించారు. వేద పాఠశాలలు ఒకే గొడుగు కిందికి రావడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వేద విద్య మరింత విస్తృతం చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పరిధిలోకి తితిదే వేద పాఠశాలలు
తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఈవో జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో తితిదే నిర్వహిస్తున్న ఆరు వేద పాఠశాలలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పరిధిలోకి తేనున్నట్లు చెప్పారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పరిధిలోకి తితిదే వేద పాఠశాలలు