కొవిడ్ బారినపడిన తితిదే ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని తితిదే ఈవో కేఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు వాక్సినేషన్ వేసుకోని ఉద్యోగులను గుర్తించి వెంటనే టీకా వేయించాలన్నారు. రెండో డోసు కావాల్సిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే ఉద్యోగులతో రద్దీ లేకుండా చూడాలన్నారు.
విభాగాల వారీగా వ్యాక్సినేషన్ వేయించుకున్న ఉద్యోగుల సంఖ్య, కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్విమ్స్, ఎస్వీ ఆయుర్వేద, రుయా తదితర ఆసుపత్రులో ఆక్సిజన్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల కోసం స్విమ్స్‌లో కొన్ని పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉద్యోగులు కోరిన విధంగా 50:50 నిష్పత్తిలో విధులకు హాజరయ్యేందుకు, వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈవో అనుమతించారు.