ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆసుపత్రి భవన నిర్మాణాన్ని.. ఈనెల 20 లోపు పూర్తి చేయాలి: తితిదే ఈవో - తితిదే ఈవో న్యూస్

ఈ నెల 20 లోపు బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో తితిదే నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు పూర్తి చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

ttd eo on birrs child hospital
ఆసుపత్రి భవన నిర్మాణాన్ని ఈనెల 20 లోపు పూర్తి చేయాలి

By

Published : Jul 7, 2021, 9:57 PM IST

బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో తితిదే నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు ఈ నెల 20 లోపు పూర్తి చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. మూడు ఆపరేషన్ థియేటర్లు, ఓపీ, ఐసీయూ, జనరల్ వార్డులు, ల్యాబ్, పరిపాలనా విభాగాల పనుల పురోగతిపై ఆరా తీశారు.

నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు, ఫర్నీచర్, ఇతర యంత్రాలు ఏర్పాటు ఎప్పటిలోపు పూర్తవుతుందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details