ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD EO JAWAHARREDDY: ప్రకృతి విపత్తులను మందస్తు అంచనా వేసే వ్యవస్థ అవసరం: ఈవో జవహర్​రెడ్డి - TTD EO JAWAHARREDDY NEWS

TTD EO Jawahar Reddy Review : భారీ వర్షాలు, వరదల లాంటి ప్రకృతి విపత్తులతో జరిగే నష్టాన్ని, ప్రమాదాలను ముందుగానే అంచనా వేసే సాంకేతిక వ్యవస్థను అందుబాటులో తెవాలని అధికారులను తితిదే ఈవో జవహర్​రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విపత్తుల సమయంలో భక్తులకు సహాయం, సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.

ttd eo meeting
తితిదే ఈవో జవహర్‌రెడ్డి

By

Published : Nov 29, 2021, 12:19 AM IST

Updated : Nov 29, 2021, 11:00 AM IST

TTD EO Jawahar Reddy Review: తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో తితిదే ఈవో జవహర్​రెడ్డి సమీక్ష(TTD EO Jawahar Reddy Review) నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల లాంటి ప్రకృతి విపత్తులతో జరిగే నష్టాన్ని, ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి భక్తులకు హెచ్చరికలు జారీచేసే వ్యవస్థను అందుబాటులో ఉంచాలని అధికారులను ఈవో ఆదేశించారు. విపత్తుల సమయంలో భక్తులకు సహాయం చేయడం, విభాగాల సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న(TTD EO Jawahar Reddy guide to restoration works in tirupati) రెండు కనుమ రహదారులు, శ్రీవారి మెట్టు మార్గంలో కోతకు గురైన రహదారులు, రక్షణ గోడలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. శ్రీవారి మెట్టు మార్గం పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి సమయం పట్టే అవకాశమున్నందున తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

తిరుమల కనుమ రహదారుల్లో కొండ చరియలు విరిగిపడటం, రహదారి కుంగిపోవడం వంటి సంఘటనలు నివారించడానికి నిపుణుల కమిటీ సిఫారసులు అమలు చేయాలని అన్నారు. తిరుమల నారాయణగిరి విశ్రాంతి గృహాల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజ మరమ్మతులు చేసి భక్తులకు గదులు కేటాయించాలన్నారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టాలు, ప్రకృతి విపత్తుల సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డాక్యుమెంట్ రూపొందించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా.. వర్షం తీవ్రతను బట్టి భక్తులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, సిబ్బందిని అనునిత్యం అప్రమత్తం చేయాలని ఈవో సూచించారు.

ఇదీ చదవండి:

TTD ALERT WITH RAINS IN TIRUMALA : తిరుమలలో వర్షం..ఘాట్​రోడ్లలో ద్విచక్రవాహనాలు నిలిపివేత

Last Updated : Nov 29, 2021, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details