Vaikunta Ekadasi At Tirumala : వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తితిదే ఈవో జవహర్ రెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్షించారు. పర్వదినం నాడు చేపట్టే కార్యక్రమాలు..భక్తులకు కల్పించే వసతులపై ఆరా తీశారు.
తిరుమలలో ఈనెల 13న మొదలుకానున్న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు గత ఏడాది మాదిరిగానే పది రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. వేకువ జామున 12గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుస్తామని తెలిపారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఒంటిగంట 45నిమిషాల నుంచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు ఈవో వెల్లడించారు. ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శన టికెట్లు కేటాయిస్తామని... సిఫార్సు లేఖలు తీసుకోమని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాక్సినేషన్ గానీ కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో గానీ తిరుమలకు రావాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తూ కరోనా నిబంధలను తప్పక పాటించాలని సూచించారు. తిరుమలలో కాటేజీల మరమ్మతుల నేపథ్యంలో వసతి గదుల లభ్యతకు కొంత కొరత ఏర్పడిందని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి : TTD EO: రాతప్రతుల డిజిటలైజేషన్‌కు సమగ్ర నివేదిక రూపొందించండి: తితిదే ఈవో