రాష్ట్రపతి కోవింద్ ఈనెల 24న తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి రాష్ట్రానికి రానున్నారు. పర్యటన ఏర్పాట్లపై ఈఓ జవహర్ రెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.