ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hanuman Birthplace: 'హనుమంతుడి జన్మస్థలంపై బలమైన ఆధారాలు చూపితేనే పునరాలోచిస్తాం' - హనుమంతుడి జన్మస్థలంపై వివాదం వార్తలు

తితిదే చూపుతున్న ఆధారాల కంటే బలమైన ఆధారాలు ఎవరైనా చూపితే హనుమ జన్మస్థలం(Hanuman Birthplace)పై పునరాలోచిస్తామని.. అప్పటి వరకు హనుమంతుని జన్మస్థలం(Hanuman Birthplace) అంజనాద్రేనని భావిస్తామని.. తితిదే ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

ttd eo jawahar reddy on hanuman birth place
ttd eo jawahar reddy on hanuman birth place

By

Published : Jun 5, 2021, 2:07 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బగా తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో తితిదే ఈవో జవహర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడిన.. ఆయన.. హనుమంతుని జన్మస్థలం(Hanuman Birthplace)పై చోటు చేసుకొన్న వివాదాలు త్వరలోనే సర్దుమణుగుతాయన్నారు. జపాలి నుంచి ఆకాశగంగకు జన్మస్థలం మార్చటంపై స్పందించిన ఈఓ అంజనాద్రిలో జపాలి, ఆకాశగంగ తీర్థాలు పక్క, పక్కనే ఉన్నాయన్నారు. గోవిందానంద సరస్వతీ స్వామి తితిదే పై విమర్శకు పరిమితం అవుతున్నారని, ఆయన చూపిన ఆధారాలు సరిగా లేవని ఈఓ అభిప్రాయపడ్డారు. తితిదే చూపుతున్న ఆధారాలకంటే బలమైన ఆధారాలు చూపితే అంజనాద్రి హనుమ జన్మస్థానం(Hanuman Birthplace)పై పునరాలోచిస్తామవి తెలిపారు. అప్పటివరకు అంజనాద్రి హనుమ జన్మస్థానమని ఆయన స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details