తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. అలిపిరి నడక మార్గంలోని మరుగుదొడ్లలో మరింత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. తిరుమలతో పాటు నడక మార్గం పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామన్నారు. కనుమదారులతో పాటూ నడక మార్గంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా వివిధ రకాల పుష్పాల మొక్కలు పెంచాలని సూచించారు.
TTD EO : 'తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి' - TTD EO jawahar reddy observe development works in tirumala
తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా వివిధ రకాల పుష్పాల మొక్కలు పెంచాలని సూచించారు.
తితిదే ఈవో జవహర్ రెడ్డి