శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన కార్యాలయాన్ని తితిదే ఈఓ కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. అదనపు ఈఓ, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డి కార్యాలయంలోని స్టూడియోలు, డబ్బింగ్, ఎడిటింగ్ విభాగాల పనితీరును ఈఓకు వివరించారు.
ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన తితిదే ఈఓ - ఎస్వీబీసీ కార్యాలయంపై వార్తలు
ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని తితిదే ఈఓ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఛానల్ ప్రసారాలు, పరిపాలన మొత్తం నూతన భవనంలోకి మార్చాలని ఆదేశించారు.
ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన తితిదే ఈఓ జవహర్ రెడ్డి.
నూతన కార్యాలయం పరిశీలించిన ఈఓ ఛానల్ ప్రసారాలు, పరిపాలన మొత్తం నూతన భవనంలోకి మార్చాలని ఆదేశించారు. కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సాంకేతిక విభాగం, తితిదే ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: పేకాట శిబిరంపై పోలీసుల దాడి... భవనంపై నుంచి దూకి ఒకరు మృతి