తిరుమలలో వసతిగృహాల మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని తితిదే ఈవో జవహర్‌రెడ్డి.. ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానికంగా జరుగుతున్న వివిధ అభివృద్ది పనులపై ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాటేజీల మరమ్మతు పనులు దశల వారిగా ప్రారంభమయ్యాయని... వీటిని అన్ని సదుపాయాలతో వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఆధ్యాత్మిక పుస్తకాలను విడుదల చేయలని వివరించారు.
ఉద్యోగులకు సంబంధించిన ఎస్‌ఆర్‌లు, సెలవులు, ఇంక్రిమెంట్లు... వంటి సమస్త సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలి. నిర్మాణంలో ఉన్న పరకామణి భవనాన్ని బ్రహ్మోత్సవాలలోపు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకురావాలి. భక్తుల తాకిడి నానాటికి పెరుగుతున్నందున పార్కింగ్ సమస్యను అధిగమించటానికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలి. అలాగే పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించడానికి విస్తృతంగా మొక్కలు నాటాలి.