ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి - ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహోత్సవాలు

TTD EO Dharma Reddy: ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయని.. తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

TTD EO Dharma Reddy
TTD EO Dharma Reddy

By

Published : Jul 1, 2022, 4:11 PM IST

TTD EO on Srivari Brahmotsavam: గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లుగా కొవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని.. ఈ ఏడాది యథావిధిగా వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వాహణకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

'సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. అక్టోబర్‌ 1న గరుడ సేవ, 2న బంగారు రథం, అక్టోబర్‌ 4న మహారథం, 5న చక్రస్నానం' కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి సెప్టెంబర్ 27న పట్టు వస్త్రాలు సమర్పణకు ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రికి ఆహ్వానపత్రిక ఇస్తామన్నారు. మరోవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.

  • సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఆరంభం
  • అక్టోబర్‌ 1న గరుడ సేవ
  • 2న బంగారు రథం
  • అక్టోబర్‌ 4న మహారథం
  • 5న చక్రస్నానం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details