ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ - టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ తాజా వార్తలు

తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ
తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ

By

Published : Sep 30, 2020, 10:29 PM IST

Updated : Sep 30, 2020, 11:40 PM IST

22:27 September 30

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్​ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను దేవాదాయశాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్​ సింఘాల్​ను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. తితిదే ఇన్​ఛార్జి‌ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమించింది. 

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ధర్మారెడ్డి ఈవోగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు తితిదే ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ 2017 మే 1 నుంచి తితిదే ఈవోగా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి :  ఈనాడు కథల పోటీకి ఆహ్వానం


 

Last Updated : Sep 30, 2020, 11:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details