ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వీలైతే భక్తుల సంఖ్య పెంచుతాం: తితిదే ఈవో - tirumala news

తిరుమలలో ప్రయోగాత్మక దర్శనాలు సజావుగా సాగుతున్నాయని... అవసరమైతే మార్పులు చేసేందుకు యోచిస్తున్నామని తితిదే ఈవో అనిల్​కుమార్ సింఘాల్ తెలిపారు. 11వతేదీ నుంచి సాధారణ భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయని...పరిస్థితులను బట్టి భక్తుల సంఖ్య పెంచుతామన్నారు.

Ttd Eo anil kumar singhal
తితిదే ఈవో అనిల్​కుమార్

By

Published : Jun 9, 2020, 6:21 PM IST

తితిదే ఈవో అనిల్​కుమార్

ప్రయోగాత్మకంగా ఉద్యోగుల ద్వారా ప్రారంభించిన దర్శనాల్లో లోటుపాట్లను గుర్తించి అవసరమైతే తగిన విధంగా మార్పులు చేస్తామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో గంటకు 500 మందిని అనుమతిస్తున్నామని... 11 నుంచి ప్రారంభమయ్యే పూర్తిస్థాయి దర్శనాల్లో వీలైతే సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు.

తలనీలాలు సమర్పించే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టామని వివరించారు. భక్తుడికి, క్షురకుడికి మధ్య భౌతిక దూరం తక్కువ ఉంటోందని.. అనుకోని పరిస్థితులు ఎదురైతే తలనీలాలు సమర్పించే అంశం పై పునఃసమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 11 నుంచి ప్రారంభం కానున్న దర్శనాలు, తితిదే అనుసరిస్తున్న విధానాల పై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details