DEVOTEES PROBLEMS IN TIRUMALA : తిరుమలలో పారిశుధ్య ఒప్పంద కార్మికుల ఆందోళనతో.. తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తితిదే ఎఫ్‌ఎమ్‌ఎస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పనిచేసే కార్మికులు.. తమను తితిదే కార్పొరేషన్లో కలపాలంటూ వారం రోజులుగా విధులు బహిష్కరించి, ఆందోళన చేస్తున్నారు. దీంతో.. పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్తాయి.
DEVOTEES PROBLEMS IN TIRUMALA : కాంట్రాక్టు కార్మికుల ఆందోళన.. భక్తులకు తప్పని ఇబ్బందులు - tirumala latest news
![DEVOTEES PROBLEMS IN TIRUMALA : కాంట్రాక్టు కార్మికుల ఆందోళన.. భక్తులకు తప్పని ఇబ్బందులు తిరుమలలో గదులు లభించక భక్తుల ఇబ్బందులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13848171-433-13848171-1638945680397.jpg)
11:04 December 08
గదులను శుభ్రం చేయకపోవడంతో.. భక్తులకు కేటాయింపు నిలిపివేత
గుత్తేదారు సంస్థలు.. అరకొర కార్మికులతో గదులను శుభ్రం చేయిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో పనులు జరగట్లేదు. ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. గదులను శుభ్రం చేయకపోవడంతో.. భక్తులకు కేటాయించడాన్ని తితిదే ఈ రోజు నిలిపివేసింది.
ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వేచి ఉన్నా.. ఇప్పటికీ గదిని కేటాయించలేదని, అడిగితే సరైన సమాధానం చెప్పే వారూ కరవయ్యారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీచదవండి :