తిరుపతి నగరంతోపాటు నగర శివార్లలో తితిదే ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్ధలాలను ధర్మకర్తల మండలి రద్దు చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తితిదే (ttd) పరిపాలన భవనం ప్రక్కన ఉన్న జాబిలి ప్రాంగణంలో సమావేశం అయ్యారు. 2007లో కేటాయించిన స్థలాలను (house sites) రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నగరశివార్లలోని ఇళ్ల స్ధలాలను వదిలేసి.. 20 కిలోమీటర్ల దూరంలో కేటాయించడంపై చర్చించారు. తితిదే నిర్ణయంపై పునరాలోచించి తమ ఇళ్ల స్థలాలు అప్పగించాలని కోరారు.
ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో తీర్మానాన్ని రద్దు చేస్తామని ఈవో హామీ ఇచ్చారని.. ఆ మేరకు తితిదేపై ఒత్తిడి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వడమాలపేట సమీపంలో ప్రభుత్వం ఆమోదించిన 300 ఎకరాల స్థలంతో పాటు ఎస్వీ పూర్ హోమ్, డైరీ ఫామ్ తదితర ప్రాంతాలల్లో స్ధలాలను అభివృద్ది చేసి ఉద్యోగులకు అందించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో తీర్మానం చేశారు.