ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా అభ్యర్థి తరపున తితిదే ఉద్యోగుల ప్రచారం..!

తితిదే ఉద్యోగులు రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని 41వ డివిజన్ వినాయక నగర్ క్వార్టర్స్​లో వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ కెమెరాకు చిక్కారు. అంతలోనే అకడ్నుంచి సర్దుకున్నారు. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ttd
ttd

By

Published : Mar 6, 2021, 10:17 PM IST

Updated : Mar 6, 2021, 10:51 PM IST

వైకాపా అభ్యర్థి తరపున తితిదే ఉద్యోగుల ప్రచారం..!

నిబంధనలకు విరుద్ధంగా తిరుపతిలో తితిదే ఉద్యోగులు రాజకీయ ప్రచారం నిర్వహించారు. నగరంలోని 41వ డివిజన్ వినాయక నగర్ క్వార్టర్స్ లో వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ కెమెరాకు చిక్కారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తూ....కెమెరా చూసే సరికి చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. ప్రచారం నిర్వహిస్తున్న వారిలో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు కేవలం శ్రీవారి సేవలో ఉంటూ ధర్మప్రచారం తప్ప మరే రాజకీయ అంశాల్లోనూ జోక్యం చేసుకోకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఇలా రాజకీయ ప్రచారం చేయటంతో.. వారు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

Last Updated : Mar 6, 2021, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details