ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో తితిదే డిప్యూటీ ఈవో మృతి - తిరుమల తాజా సమాచారం

కొవిడ్​తో తితిదే డిప్యూటీ ఈవో కె. నాగరాజు మృతి చెందారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో డిప్యూటీ ఈవోగా నాగరాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ttd eo
ttd eo

By

Published : Apr 30, 2021, 10:23 AM IST

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం డిప్యూటీ ఈవో కె .నాగరాజు (60) కరోనా బారినపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. తితిదే అన్నప్రసాద ట్రస్టు డిప్యూటీ ఈవోగా ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. గతంలోనూ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఇబ్బందిపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకుని తితిదే విధుల్లోకి చేరారు. జూన్​లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న తరుణంలో మృతి చెందడం ఆయన కుటుంబ సభ్యులను కలచివేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details