ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD CONTRACT EMPLOYEES PROTEST : తితిదే కార్మికుల నిరసన... సమస్యల పరిష్కారానికి డిమాండ్ - Tirupati latest news

TTD Contract Employees protest in tirupathi : తితిదే ఒప్పంద కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. దాదాపు ఏడు వేలమంది వారం రోజులుగా విధులు బహిష్కరించి చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తిరుపతి వచ్చిన సీఎం జగన్‌... సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినా వారు వెనక్కి తగ్గలేదు. టైం స్కేల్‌ వర్తింపచేయడం తప్ప మరేవీ తమ సమస్యకు పరిష్కారం కాదని తేల్చిచెబుతున్నారు.

తితిదే కార్మికుల నిరసన
తితిదే కార్మికుల నిరసన

By

Published : Dec 5, 2021, 4:28 AM IST

Updated : Dec 5, 2021, 8:18 AM IST

తితిదే కార్మికుల నిరసన... సమస్యల పరిష్కారానికి డిమాండ్

TTD Contract Employees protest in tirupathi : తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి శ్రీనివాస కార్పొరేషన్‌ పరిధిలోకి తమను తీసుకోవాలని కోరుతూ ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వారం దాటింది. 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాల్లేవని ఎఫ్ఎమ్ఎస్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన బాట పట్టారు. తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతిగృహాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద నిరసనకు దిగారు.

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. తొలుత ఆందోళన విరమించాలని భావించిన కార్మికులు ఆ హామీ అమల్లోకి వచ్చేదాకా నిరసన కొనసాగింపునకు నిర్ణయించుకున్నారు. ఈ నెల 9న తిరుమలలో జరగనున్న తితిదే ధర్మకర్తల మండలి భేటీలో తమ సమస్యను పరిష్కరిస్తూ తీర్మానం చేస్తారని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు నిర్ణయించారు.

ఇదీచదవండి: Jawad Cyclone : తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను

Last Updated : Dec 5, 2021, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details