ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు తితిదే ఫిర్యాదు - సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు తితిదే ఫిర్యాదు తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమని తితిదే హెచ్చరించింది.

సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు  తితిదే ఫిర్యాదు
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

By

Published : Dec 28, 2020, 10:55 PM IST

తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆలయ ప్రాకారంపై పూర్ణ కలశ ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను అన్యమత గుర్తులుగా మార్ఫింగ్ చేసి తాళపత్ర నిధి ఫేస్​బుక్ యూఆర్​ఎల్...సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేసిందని తితిదే వెల్లడించింది. పవిత్రమైన కళశాన్ని మార్ఫింగ్ చేసి కుట్రపూరితంగా దుష్ప్రచారం చేశారన్నారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమనని తితిదే హెచ్చరించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details