ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఛైర్మన్‌ - తిరుమలలో వైకుంఠ ఏకాదశి తాజా వార్తలు

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అర్ధరాత్రి తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారం తెరుస్తామన్నారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఛైర్మన్‌
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఛైర్మన్‌

By

Published : Dec 24, 2020, 7:01 PM IST

Updated : Dec 24, 2020, 7:39 PM IST

పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తితిదే చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి వైకుంఠ ఏకాదశి కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. రోజుకు 35 నుంచి 38 వేల మందికి దర్శనం కల్పించే అవకాశం ఉండడంతో... 10రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 10వేల టోకెన్ల చొప్పున.. లక్ష టిక్కెట్లును సర్వదర్శనం కేంద్రాల ద్వారా.... ఆన్‌లైన్‌లో 20వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను భక్తులకు ఇచ్చినట్లు వివరించారు. ప్రముఖులకు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.

కొవిడ్ నిబంధనలు పాటించాలి

అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారం తెరిచి... శుక్రవారం అభిషేకం నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామివారికి అభిషేకం, అలంకరణ పూర్తయిన తరువాత నాలుగు గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులందరూ కొవిడ్‌ నిబ్బందనలను పాటిస్తూ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏకాంతంగా చక్రస్నానం

ఏకాదశి సందర్భంగా ఉదయం 9 గంటలకు స్వర్ణరథోత్సవం నిర్వహిస్తామని.. మహిళలతో రథం లాగించే సంప్రదాయం ఉండడంతో... కరోనా పరీక్ష చేసుకున్న 200 మంది తితిదే ఉద్యోగులతోనే రథోత్సవం నిర్వహిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ద్వాదశి సందర్భంగా నిర్వహించే చక్రన్నానాన్ని ఏకాంతంగా నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.

గుడికో గోమాత కార్యక్రమం

సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా చేయడానికే గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో 32 ఆవులు, దూడలను దానం చేశారు. అనంతరం గోవుల పోషణకు నగదు విరాళం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో గుడికో గోమాత ప్రారంభించామని తెలిపారు. త్వరలో తమిళనాడులో ప్రారంభిస్తామన్నారు. గోవును సంరక్షించుకునే వసతి, ఆర్థికస్థితి కలిగిన ఏ ఆలయం ముందుకొచ్చినా తితిదే ఆవు, దూడను అందిస్తుందన్నారు. గోవులు దానంగా ఇవ్వలేని వారు శక్తి మేరకు నగదు రూపంలో విరాళం ఇస్తే గోవుల సంరక్షణకు ఊపయోగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...

Last Updated : Dec 24, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details