ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో భక్తుల తోపులాటకు కారణం అదే : వైవీ సుబ్బారెడ్డి - endowment Minister Satyanarayana inspected at Tirumala

Tirumala: తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే సర్వదర్శన క్యూ లైన్లలో తోపులాట జరిగిందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే.. పరిస్థితిని సమీక్షించి వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే.. తిరుమలలో క్యూలైన్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

By

Published : Apr 15, 2022, 3:30 PM IST

క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే తోపులాట: వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy: తితిదే విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే తిరుపతిలో భక్తుల తోపులాట చోటుచేసుకుందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుపతి ఎస్వీ గోశాలలో రూ.3కోట్లతో నిర్మించనున్న నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. 8 నెలల్లో ఘీ ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. పూర్తి విరాళాలతోనే దీన్ని నిర్మిస్తున్నామని.. రోజుకు 60 కిలోల నెయ్యి ఉత్పత్తి చేసేలా కేంద్రాన్ని రూపొందించామన్నారు. భక్తులకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని సుబ్బారెడ్డి తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. వేసవిలో రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశామని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకు వరకు శ్రీవారి మెట్టు మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Minister Kottu Satyanarayana inspected at Tirumala: తిరుమలలో క్యూలైన్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్ల వద్ద సాధారణ భక్తులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. స్వయంగా భక్తులతో మాట్లాడిన మంత్రి.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి బొత్స మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే తిరుమలలో టైంస్లాట్ దర్శన విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో టొకెన్ల జారీ కేంద్రం వద్ద తొపులాట జరిగిందని.. ఇకపై అలాంటి సమస్య పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు.. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details