తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా రెండవసారి పదవీ వరించడంతో శ్రీవారి మెట్టు మార్గం గుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు నడిచి వెళ్ళారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
TTD CHAIRMAN: మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వైవీ సుబ్బారెడ్డి - ttd latest news
టీటీడీ ఛైర్మన్గా రెండవసారి పదవీ వరించడంతో శ్రీవారి మెట్టు మార్గం గుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు నడిచి వెళ్లారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలకు నడిచి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి
భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో చొరవ చూపుతానని దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కరోనా మహమ్మారి నుంచి రక్షింపబడాలని స్వామివారిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.