తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రకటనపై తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించానని ఆయన అన్నారు. తితిదే యాక్ట్ 136,137 నిబంధనల ప్రకారం హిందూయేతరులు ఎవరు దర్శనానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఈ నిబంధనకు తితిదే కట్టుబడి ఉందని తెలిపారు.
'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...' - అన్యమతస్థులు డిక్లరేషన్‌పై టీటీడీ ఛైర్మన్ కామెంట్స్
అన్యమతస్థుల డిక్లరేషన్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారన్నారు. తితిదే యాక్ట్ 136, 137 నిబంధనల ప్రకారం అన్యమతస్థులు దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించానని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
yv subba reddy
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ గతంలో దర్శనానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందన్న సుబ్బారెడ్డి... సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభం, ముగింపు తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. దయచేసి తన ప్రకటనను వక్రీకరించొద్దని కోరారు.
ఇదీ చదవండి :ఎన్డీబీ రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు