లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత శ్రీవారి దర్శనాల్లో భారీ మార్పులు ఉంటాయని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సాధారణ పరిస్ధితులు నెలకొన్న తర్వాతే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులను అనుమతించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులను అనుమతించే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో క్యూ లైన్లలో మార్పులు చేసే ఆంశంపై చర్చిస్తున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
లాక్డౌన్ తర్వాతే శ్రీవారి దర్శనం: వైవీ సుబ్బారెడ్డి
కరోనా కేసులు పెరుగుతుండటంతో పరిస్థితులు అనుకూలంగా లేవని... లాక్డౌన్ తర్వాతే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి