తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన(chandrababu kuppam tour news)పై తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు(ttd chairman yv subba reddy slams chandrababu news). తిరుపతి మహతి కళాక్షేతంలో తితిదే నిర్వహిస్తున్న గో మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అరాచకాలు చేసే సంప్రదాయం వైకాపాకు, అధికారులకు లేదన్నారు.
అమరావతిలో ఏవిధంగా దాడులు చేయించుకుని.. దిల్లీ వరకు రంకెలు వేశారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. దిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు(chandrababu delhi tour news). కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నారని.. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతో జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండిపోతారన్న భయంతోనే హడావిడి చేస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రజలు ఓ సారి బుద్ధి చెప్పారని.. మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.