ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: తిరుమలలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం.. నష్టం ఎంతంటే ? - తితిదే ఛైర్మన్ న్యూస్

తిరుమలలో గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం ఈసారి (rains in tirumala) కురిసిందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భారీ వర్షాల వల్ల తితిదేకు రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.

ttd chairman yv subba reddy
తితిదే ఛైర్మన్

By

Published : Nov 20, 2021, 9:35 PM IST

భారీ వర్షాల వల్ల తితిదేకు రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV subba reddy) వెల్లడించారు. తిరుమలలో 30 ఏళ్లుగా ఎప్పుడూ లేని వర్షం ఈసారి (rains in tirumala) కురిసిందన్నారు. ఘాట్‌ రోడ్‌లోని 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, 5 చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయని వైవీ స్పష్టం చేశారు.

నారాయణగిరి అతిథి గృహం, కపిలతీర్థం మండపాలు దెబ్బతిన్నాయన్నారు. ఘాట్‌ రోడ్లు, మెట్లమార్గంలో వెంటనే మరమ్మతు పనులు చేపట్టామన్న వైవీ.. తిరుమల వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details