తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు హారాన్ని విరాళంగా అందచేశారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పంచమీ తీర్థం(చక్రస్నానం) పురస్కరించుకుని.. సతీమణి స్వర్ణలత రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 55.160 గ్రాముల బరువుతో.. రూ. 3 లక్షలకు పైగా విలువైన ఆభరణాన్ని అమ్మవారికి బహూకరించారు.
తిరుచానూరు అమ్మవారికి తితిదే ఛైర్మన్ లక్ష్మీకాసుల హారం విరాళం - పద్మావతి అమ్మవారికి బంగారు హారం విరాళమిచ్చిన తితిదే ఛైర్మన్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి.. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు బంగారు హారాన్ని విరాళమిచ్చారు. రూ. 3 లక్షలకుపైగా విలువ చేసే, 55.160 గ్రాముల బరువున్న ఈ ఆభరణాన్ని.. ఈవో జవహర్ రెడ్డికి అందచేశారు. పంచమీ తీర్థం అనంతరం నిర్వహించిన స్నపన తిరుమజనంలో.. హారాన్ని అమ్మవారికి అలంకరింప చేశారు.
కాసుల హారంతో తితిదే ఛైర్మన్ దంపతులు
ఛైర్మన్ దంపతులు.. తితిదే ఈవో జవహర్ రెడ్డికి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ కాసుల హారం అందజేశారు. అర్చకులు ఈ ఆభరణాన్ని అమ్మవారి మూలమూర్తి వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం పంచమీ తీర్థం సందర్భంగా నిర్వహించిన స్నపన తిరుమంజనంలో అమ్మవారికి అలంకరించారు.