తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ప్రాంతాలను ఆలయ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద భవనానికి చేరుకున్న ఆయన.. కొంతసేపు భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. భక్తులతో మమేకమై వారి నుంచి పలు అంశాలను ఆరా తీశారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు అందుతున్న తీరు, శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల రుచి, నాణ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భక్తులతో కలసి భోజనం చేశారు.
అనంతరం లడ్డూ వితరణ కేంద్రంను.. బూందీ తయారీ నూతన పోటును తితిదే ఛైర్మన్ పరిశీలించారు. థర్మోప్లూయిడ్ పొయ్యిలతో ఏర్పాటు చేసిన పోటుకు.. ట్రయల్ రన్ నిర్వహించామని..త్వరలోనే పోటును ప్రారంభిచనున్నట్లు తెలిపారు. దీనిద్వారా అగ్నిప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నారు.
తితిదేకు రెండు టన్నుల ఊరగాయల బహుకరణ..