ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: తితిదే ఉద్యోగుల ఏళ్ల నాటి 'కల' సాకారం...

TTD: తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి జగన్‌ సాకారం చేశారని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతో 5,518 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి మార్గం సుగమమైందని అన్నారు.

TTD chairman
కలెక్టర్‌కు చెక్కు అందజేసిన తితిదే ఛైర్మన్‌

By

Published : Apr 1, 2022, 7:50 AM IST

TTD: తితిదే ఉద్యోగుల సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి జగన్‌ సాకారం చేశారని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో గురువారం ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమి కోసం తితిదే సిద్ధం చేసిన రూ.61.63 కోట్ల చెక్కును ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ హరినారాయణన్‌కు అందజేశారు.

ముఖ్యమంత్రి చొరవతో 5,518 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి మార్గం సుగమమైందని తితిదే ఛైర్మన్‌ అన్నారు. తితిదే భూమి స్వాధీనం చేసుకున్న వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మూడు నెలల్లో సీఎం చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: Power Cuts: ఎడాపెడా విద్యుత్​ కోతలు.. ప్రతి జిల్లాలోనూ రెండు మూడు గంటలు

ABOUT THE AUTHOR

...view details