తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. గరుడోత్సవం నాడు ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. బెంగుళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి.. బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
SVBC kannada channel: 'ఎస్వీబీసీ కన్నడ ఛానల్‌కు సహాయ సహకారాలు అందిస్తాం' - kannada channel inauguration
బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో ఆ రాష్ట్ర సీఎంను తితిదే ఛైర్మన్(TTD chairman), ఈవో(EO)లు కలిశారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున ఎస్వీబీసీ కన్నడ ఛానల్(SVBC kannada channel) ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఛానల్‌కు కర్ణాటక ప్రభుత్వపరంగా అవసరమైన సహాయసహకారాలన్నీ అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
![SVBC kannada channel: 'ఎస్వీబీసీ కన్నడ ఛానల్‌కు సహాయ సహకారాలు అందిస్తాం' ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13240413-115-13240413-1633176192679.jpg)
ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 11న కన్నడతో పాటు హిందీ ఛానల్‌నూ ప్రారంభించాలని నిర్ణయించామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎస్వీబీసీ కన్నడ ఛానల్ అభివృద్ధికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్వీబీసీ కన్నడ ఛానల్‌కు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు.
ఇదీచదవండి.